Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - లక్నో
ఒక డ్యాన్సర్‌ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తన పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. బర్త్‌డే పార్టీకి ముగ్గురు డ్యానర్లను రప్పించాడు. వారు తమ డ్యాన్సులతో ఆహుతులను అలరించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్తున్న ఒక డ్యాన్సర్‌ను ఆ పార్టీలో పాల్గొన్న ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆమెను కారులో శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. మద్యం సేవించి ఉన్న ఆ వ్యక్తులు ఆ మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, బాధిత మహిళ తొలుత జజ్మౌ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు పట్టించుకోకపోవడంతో ఉన్నావో సదర్లోని కొత్వాలి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు సీరియస్‌గా స్పందించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ డ్యాన్సర్‌ను వైద్య పరీక్షల కోసం పంపారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసేందుకు వారి కోసం పోలీసులు వెతుకుతున్నారని ఉన్నావ్ ఎస్పీ తెలిపారు.