Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మాదాపూర్‌లోని 16 పబ్‌లపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రెండు పబ్‌లలో నిబంధనలకు విరుద్ధంగా మైనర్లకు మద్యం సరఫరా చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. హాట్ కప్, బర్డ్ బాక్స్ పబ్‌లపై కేసులు నమోదు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మైనర్లకు మద్యం సరఫరా చేసినందుకు హాట్ కప్ పబ్‌పై, లైసెన్సు లేకుండా పబ్ నిర్వహిస్తున్న బర్డ్ బాక్స్ పబ్‌పై కేసు నమోదు చేశారు.
ఫామ్‌హౌజ్ లలో మద్యం సరఫరాపైనా పోలీసులు చర్యలు చేపట్టారు. అనుమతి లేకుండా ఫామ్‌హౌజ్‌లోకి మద్యం తీసుకెళ్లినందుకు మొయినాబాద్‌లోని సెలబ్రిటీ, ఎటెర్నిటీ, ముషీరుద్దీన్ ఫామ్‌హౌజ్‌లపై కేసులు నమోదు చేశారు.