Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో మొత్తం 34 రైళ్లను రద్దు చేసినట్లు శనివారం రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఇందులో 18 రైళ్లు రెగ్యులర్ రైళ్లు ఉండగా.. మరో 16 రైళ్లు ఎంఎంటీఎస్‌కు సంబంధించినవిగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఈ నెల 19 తేదీలలో రద్దు చేశామన్నారు. అలాగే ఈ నెల 18న (శనివారం) 16 ఎంఎంటీఎస్ లోకల్ రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆయా మార్గంలో కొనసాగుతున్న రైల్వే పనుల వల్ల ఈ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.