Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నందమూరి తారకరత్న 20ఏళ్లకే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2002లో ‘ఒకటో నెంబర్కుర్రాడు’ సినిమాతో హీరోగా తెరంగ్రేటం ఎంట్రీ ఇచ్చిన తారకరత్న కమర్షియల్గా ఈ సినిమా అంతగా ఆడకపోయినా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత తారక్, భద్రాద్రిరాముడు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అమరావతి’ సినిమా తారకరత్నకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
అయితే ఈ సినిమాలో తారకరత్న శ్రీను అనే నెగెటీవ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాడు. ఇక ఇందులో తారకరత్న పండించిన విలనిజంకు ఆయన్ను నంది అవార్డు వరించింది. అంతలా తన పర్ఫెర్మ్తో అదరగొట్టాడు. దీనితో పాటుగా మరో రెండు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించాడు. హీరోగా అంతగా సక్సెస్ కాకపోయినా విలన్గా మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. చివరగా తారకరత్న అగ్ర దర్శకుడు క్రిష్ జాగర్లమూడి క్రియేట్ చేసిన ‘9అవర్స్’ వెబ్ సిరీస్లో నటించాడు. ఈ వెబ్ సిరీస్ తారకరత్నకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతకుముందు ‘సారధి’ అనే సినిమా చేశాడు. అదే తారకరత్న చివరి చిత్రం.