Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆంధ్రప్రదేశ్
ఏపీలో 411 ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిపిందే. దీనిలో ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది. వీరిలో 1,71,936 మంది అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నట్లు వెల్లడించింది.
ఈ తరుణంలో రాష్ట్రంలో నేడు ఎస్ఐ ఉద్యోగాలకు రాతపరీక్ష జరుగుతుంది. మొత్తం 291 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ ఉంటుందని ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతి ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. రెండో పేపర్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 05.30 గంటల వరకు ఉంటుంది.