Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బాపట్ల
జిల్లాలోని కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నగంజాం తిరుణాళ్ళకి వెళ్లి అద్దంకి తిరిగి వస్తుండగా అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీ పైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుల్లో నలుగురు అద్దంకి ఎస్సై సమందర్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. మృతుల్లో ఎస్సై సమందర్ భార్య, కుమార్తె, మరదలు తోపాటు మరో మహిళ, ప్రయివేటు డ్రైవర్ ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు.