Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిద్దిపేట
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి ఆలయంలో భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రిని పురస్కారించుకొని మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. దీంతో ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఒగ్గు పూజారులు స్వామివారి కల్యాణోత్సవాన్ని స్తుతిస్తూ పెద్దపట్నం కార్యక్రమం రాత్రి 12 గంటలకు ప్రారంభించి వేకువఝాము వరకు కొనసాగించారు. ఆలయ అర్చకులు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి పట్నం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మల్లన్నను స్తుతిస్తూ స్వామివారి చరిత్రను ఒగ్గు కథ రూపంలో చెప్పారు. ఒగ్గు కథ చెబుతూ పూజారులు ఐదు రంగులతో పెద్దపట్నం వేస్తారు. అది పూర్తికాగానే ముందుగా పట్నంలోకి బోనాన్ని తర్వాత స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు మల్లన్న నామస్మరణ చేస్తూ పట్నంపైకి దాటారు. పంచరంగుల చూర్ణాన్ని తీసుకెళ్లేందుకు భక్తులు పోటీపడ్డారు. అనంతరం నల్లపోచమ్మ, కొండపోచమ్మ ఆలయాలకు వెళ్లి అక్కడ అమ్మవార్లకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.