Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గద్వాల
జోగులాంబ గద్వాల జిల్లా బైరాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బైరాపూర్ సమీపంలో బొలెరో వాహనాన్ని బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను మానవపాడు మండలం కొరివిపాడు గ్రామానికి చెందిన సాయి, రఫీ, శేఖర్గౌడ్గా గుర్తించారు. అలంపూరులో మహాశివరాత్రి వేడుకల్లా పాల్గొని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఘటన ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ దావాఖానకు తరలించారు. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోఘటనలో ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్ రోడ్డులో జాతీయరహదారిపై జరిగిన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఒంగోలు వైపు నుంచి గుంటూరు వెళ్తున్న కారు టైరు పంక్చరవడంతో అదుపుతప్పి డివైడర్ను దాటి అవతలివైపునకు ఎగిరిపడింది. అదేసమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఆ కారును ఢీకొట్టింది. దీంతో నలుగురు మహిళలు సహా మరొకరు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు అద్దంకి ఎస్ఐ సమందరవలి భార్య వహీదా, కుమార్తె అయేషా, జయశ్రీ, దివ్యతేజ, డ్రైవర్ బ్రహ్మచారిగా గుర్తించారు. చిన్న గంజాం జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.