Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నై
ఈరోడ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు మద్దతుగా మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ నేడు(ఆదివారం) ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 27న ఉపఎన్నిక జరుగనున్న ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో డీఎంకే, అన్నాడీఎంకే కూటములు, డీఎండీకే సహా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. డీఎంకే కూటమి తరఫున పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఇళంగోవన్‌కు మద్దతుగా రాష్ట్ర మంత్రులు, కూటమి పార్టీలు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేఫథ్యంలో, లౌకికవాద కూటమి తరఫున పోటీచేస్తున్న కాంగ్రె్‌సను గెలిపించాలన్న కోరికతో కమల్‌హాసన్ ప్రచారంలో పాల్గొననున్నట్లు మక్కల్ నీది మయ్యం పార్టీ ప్రధాన కార్యాలయం శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.