Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - డమాస్కస్
సిరియా రాజధాని డమాస్కస్‌పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుపడింది. ఆదివారం ఉదయం డమాస్కస్‌లోని నివాస భావనాలపై క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో 15 మంది పౌరులు మరణించారు. పలువురు గాయపడ్డారు. నివాస ముదాయాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లు సిరియా అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున 12.30 గంటలకు భారీ శబ్దాలు వినిపించాయని స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. రెండు వారాల క్రితం ఇదే రీజియన్‌లో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ప్రకృతి ప్రకోపానికి భారీగా ప్రజలు మరణించగా, తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో మరికొంత మంది మృతిచెందారు.
కాగా, ఇటీవల కాలంలో సిరియాపై ఇజ్రాయెల్ వరుస దాడులకు పాల్పడుతున్నది. ఇరాన్ స్థావరాలకు కాపలాగా ఉన్న భద్రతా బలగాలపై క్షిపణుల వర్షం కురిపించారని, అయితే అవి నివాస సముదాయాలపై పడ్డాయని అధికారులు తెలిపారు. దీంతో సాధారణ పౌరులు మరణించారన్నారు. గతేడాది 2022, ఆగస్టులో సిరియా మిలిటరీ ఆయుధ డిపోపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు జరిపింది. దీంతో ఒక ఆర్మీ కెప్టెన్ మృతిచెందాడు.