Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - టర్కీ
తుర్కియే, సిరియా దేశాల్లో భూకంప మృతుల సంఖ్య 46 వేలు దాటింది. భారీ భూకంపం ధాటికి భారీ భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. దీంతో శిథిలాలను తొలగిస్తున్నకొద్ది పెద్దసంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు తుర్కియేలో 40,402 మంది మృతిచెందగా, సిరియాలో 5800 మంది చనిపోయారు. అయితే భూకంపం సంబవించి 12 రోజులు గడుస్తుండటంతో తుర్కియేలో సహాయక చర్యలను నేడు ముగించే అవకాశం ఉన్నది. ప్రమాదం జరిగి 296 గంటలు పూర్తవడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు కనిపించడం లేదని డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ హెడ్ యూనస్ సెజర్ తెలిపారు. దీంతో సహాయ చర్యలను చాలావరకు ఆదివారం రాత్రి ముగించనున్నట్లు వెల్లడించారు. భూకంపం వల్ల 11 ప్రావిన్సుల్లో నష్టం కలగా.. దాంట్లో ఆదనా, కిలిస్, సనిలుర్ఫా ప్రావిన్సుల్లో ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందన్నారు.