Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫిల్మ్ ఛాంబర్ వేదికగా ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో అధ్యక్ష బరిలో నిర్మాతలు దామోదర ప్రసాద్, జెమినీ గణేష్‌లు ఉన్నారు. దామోదర ప్రసాద్‌కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు మద్దతు ప్రకటించగా జెమినీ కిరణ్‌కు సీ.కల్యాణ్ మద్దతు ప్రకటించారు.
ప్రొగ్రెసివ్ ప్రొడ్యూసర్ ప్యానెల్ పేరుతో దామోదర ప్రసాద్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్యానెల్ పేరుతో జెమినీ కిరణ్ బరిలోకి దిగారు. తెలుగు నిర్మాత మండలిలో మొత్తం 1200 మంది సభ్యులు ఉన్నారు. ఈ క్రమంలో సాయంత్రం 4 గంటల తర్వాత ఎన్నికల కౌంటింగ్ ప్రారంభించి విజేతను ప్రకటిస్తారు.