Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమల
మహాశివరాత్రి, వారాంతపు సెలవు దినాల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండపై ఉన్న 24 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 22 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 71,350 మంది భక్తులు దర్శించుకోగా 28,912 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.47 కోట్లు వచ్చిందని వివరించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి తిరుపతిలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి కల్కి అలంకారంలో అశ్వవాహనంపై విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గురుమూర్తి, కంకణ బట్టర్ బాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.