Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నటుడు నందమూరి తారకరత్న మృతి చాలా బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన కోలుకుని తిరిగొస్తారని ఆశించామని చెప్పారు. హైదరాబాద్లో తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని తారకరత్న తనతో చెప్పినట్లు తెలిపారు.
‘‘చిన్న వయసులో తారకరత్న చనిపోవడం బాధేస్తోంది. కుటుంబం, అభిమానులు ప్రార్థించినా ఫలితం లేకుండా పోయింది. ఈనెల 22వ తేదీకి తారకరత్నకు 40 సంవత్సరాలు పూర్తి అవుతాయి. ఒక మంచి భవిష్యత్ ఉన్న వ్యక్తిని కోల్పోయాం. సినిమా రంగంలో ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభోత్సవం చేసిన రికార్డు ఆయనది. ‘అమరావతి’ సినిమాలో నటనకు నంది అవార్డును సొంతం చేసుకున్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ఉండేవారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన ఉందన్న అభిప్రాయాన్ని కూడా చెప్పారు. అవకాశం ఇద్దామనుకున్నాం.. దీనిపై సమయం వచ్చినపుడు మాట్లాడతానని ఆయనతో చెప్పాను. ఈలోపే తారకరత్న చనిపోవడం బాధాకరం.