Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నేటి నుంచి ట్యాంక్ బండ్ పై సండే-ఫన్డే పునఃప్రారంభమవుతుంది. గతంలో ప్రతి ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్ పై అనేక వినోద కార్యక్రమాలు, లేజర్ షోలు నిర్వహించేవారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ఇటీవల హుస్సేన్ సాగర్ సీతారామంలో ఫార్ములా ఇ రేస్ పోటీలు జరిగిన కారణంగా సండే-ఫన్డేను మధ్యలో నిలిపివేశారు.
అవి పూర్తవ్వడంతో ఇప్పుడు సండే-ఫన్డే పునఃప్రారంభమవుతున్నట్లు హెడ్ ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక్కడికి వచ్చే వారి ఉత్సాహం కోసం ఏకంగా రూ. 17 కోట్లతో హుస్సేన్ సాగర్లో మ్యూజికల్ ఫౌంటెన్ను గ్రాండ్గా ఏర్పాటు చేశారు. నిత్యం బిజీబిజీగా ఉంటూ కుటుంబ సమేతంగా ఆనందంగా గడిపేందుకు టెన్షన్ పడే వారికి ఆదివారం మంచి అవకాశం అంటున్నారు అరవింద్ కుమార్. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు 4 షోలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఒక్కో షో 15 నిమిషాల పాటు ఉంటుందన్నారు.