Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆంధ్రప్రదేశ్
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట పరిధిలో ఓ బైక్ లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృతిచెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హుకుంపేట మండలంలోని బూర్జ పంచాయతీ దిగువ సాల్తాంగి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బైక్పై బొర్రా గుహల వద్దకు వెళ్లారు. అక్కడ శివరాత్రి వేడుకలను తిలకించి ఉదయాన్నే తిరిగి వస్తుండగా లుంగపర్తి పంచాయతీ రాయపాడు శివారులోని మలుపు వద్ద బైక్ లోయలోకి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు యువకులు బుట్టన్న, గణేశ్, రాంబాబు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది.