Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూయార్క్
వారానికి మూడు రోజులు ఆఫీసుల నుంచి పనిచేయాలని ఉద్యోగులను అమెజాన్ సీఈఓ అండీ జస్సీ కోరారు. ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లి పనిచేస్తే ఇతర వ్యాపారాలూ పుంజుకుంటాయని ప్రపంచవ్యాప్తంగా తమ కార్యాలయాల చుట్టూ ఉండే వ్యాపారాలు పెరుగుతాయని ఆకాంక్షించారు. కరోనా కలకలంతో గత మూడేండ్లుగా పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేందుకు మొగ్గుచూపగా మహమ్మారి నెమ్మదించడంతో ఆయా కంపెనీలు తిరిగి ఉద్యోగులను కార్యాలయాలకు రప్పిస్తున్నాయి.
ఈ తరుణంలో కార్యాలయాల నుంచి పనిచేయడం ద్వారా ఉద్యోగులు ఒకరినొకరు సంప్రదించుకుని సమన్వయంతో పనిచేయడం సులువవుతందని తెలిపింది. ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయాల నుంచి పనిచేయాలని కంపెనీ నిర్ణయించిందని బ్లాగ్‌పోస్ట్‌లో అమెజాన్ స్పష్టం చేసింది.