Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
గచ్చిబౌలిలో సినీ నటుడు నరేశ్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంటిముందు పార్కింగ్ చేసిన కారుపై దుండగులు దాడికి పాల్పడ్డారు. కొందరు వ్యక్తులు రాత్రి తన కారుని ధ్వంసం చేశారని నరేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేశ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణంలో భాగంగా సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. రమ్యరఘుపతి తనను చంపేందుకు ప్రయత్నించిందని, ఇంటివద్ద రెక్కీ కూడా నిర్వహించారని నరేశ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు.
అయితే తాజాగా ఇంటిపై దాడి జరుగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కాగా తనపై, పవిత్ర లోకేశ్‌పై కొన్ని యూట్యూబ్ ఛానళ్ల ద్వారా రమ్య రఘుపతి (నరేశ్ మూడో భార్య) దుష్ప్రచారం చేయిస్తోందని సైబర్ క్రైం పీఎస్‌లో గతంలో పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాడు నరేశ్. మూడు యూ ట్యూబ్ ఛానల్స్ తమ వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించి.. అన్నీ తెలిసినట్టే ప్రచారం చేస్తున్నాయని, ఆ ఛానల్‌కు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పాడు నరేశ్. అయితే ఇప్పటికే సైబర్ క్రైం పోలీసులను కలిసి.. విచారణకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. నరేశ్-పవిత్ర లోకేశ్ బంధంపై రమ్యరఘుపతి మొదటి నుంచి పలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు నరేశ్ కూడా ఎప్పటికపుడు ఆమెకు కౌంటర్ ఇస్తూ వస్తున్నాడు.