Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ.సాయన్న మృతి రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపై విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా సాయన్న చేసిన సేవలను కొనియాడారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అరుదైన ఘనత సాధించారని పేర్కొన్నారు. వివిధ పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజాసేవ చిరస్మరణీయమన్నారు. సాయన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సాయన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. గత కొద్దిరోజులుగా గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సాయన్న యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. సాయన్న మృతితో కంటోన్మెంట్ నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సాయన్న ఇప్పటి వరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.