Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
వై సిరీస్‌లో వివో వై56 పేరుతో వివో మరో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. భారత్‌లో వై56ని వివో లాంఛ్ చేసింది. స్టైలిష్ డిజైన్‌తో పాటు ఆకట్టుకునే ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల ముందుకొచ్చింది. వివో వై56 సూపర్ నైట్ కెమెరా ఫీచర్‌తో పాటు 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. యువ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని తాము ఆల్ న్యూ స్టైలిష్, ట్రెండీ డివైజ్‌ను ప్రవేశపెట్టామని వివో వై56 లాంఛ్ సందర్భంగా వివో ఇండియా బ్రాండ్ స్ట్రేటజీ హెడ్ యోగేంద్ర శ్రీరాముల పేర్కొన్నారు. వై సిరీస్‌లో రూ. 20,000లోపు ధరలో తొలి 5జీ డివైజ్‌గా వై56 5జీ కస్టమర్ల ముందుకొచ్చింది. వివో వై56 8జీబీ +128జీబీ వేరియంట్ రూ. 19,999కి అందుబాటులో ఉంటుంది. వివో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ వివో ఇండియా ఈ స్టోర్‌తో పాటు పార్టనర్ రిటైల్ స్టోర్లు అన్నింటిలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఆరంజ్, బ్లాక్ ఇంజిన్ కలర్ ఆప్షన్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. ఐసీఐసిఐ, ఎస్బీఐ, కొటక్ మహింద్ర ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 1000వరకూ క్యాష్ బ్యాక్ పొందే వీలుంది. వివో వై56 6.58 ఇంచ్ డిస్ప్లేతో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్తో కస్టమర్ల ముందుకొచ్చింది. వివో వై56 50ఎంపీ నైట్ మెయిన్ కెమెరా, ముందుభాగంలో హైరిజల్యూషన్‌తో కూడిన సెల్ఫీ ఇమేజ్‌ల కోసం 16 ఎంపీ కెమెరా కలిగిఉంది.