Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: ఆదివారం జరిగిన తెలుగు చలన చిత్ర నిర్మాత మండలి ఎన్నికల్లో అధ్యక్షుడిగా కె. ఎల్. దామోదర్ ప్రసాద్ గెలిచారు. ప్రత్యర్థి జెమిని కిరణ్‌పై 24 ఓట్ల తేడాతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. 339 మంది సభ్యులు ఆయనకు ఓటేశారు. ఉపాధ్యక్ష పదవికి వై. సుప్రియ, కె. అశోక్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ట్రెజరర్‌గా టి. రామ సత్యనారాయణ, సెక్రటరీగా టి. ప్రసన్న కుమార్ (397 ఓట్లు), వై. వి. ఎస్. చౌదరి (380 ఓట్లు), జాయింట్ సెక్రటరీగా భారత్ చౌదరి (412 ఓట్లు), నట్టి కుమార్ (247) గెలిచారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా దిల్‌రాజు, డీవీవీ దానయ్య, పీవీ రవికిశోర్, రవిశంకర్ యలమంచిలి, ఎన్. పద్మిని, బి. వేణుగోపాల్, వై. సురేందర్ రెడ్డి, గోపీనాథ్ ఆచంట, ఠాగూర్ మధు, కేశవరావు పల్లి, శ్రీనివాసరావు వజ్జ, అభిషేక్ అగర్వాల్, కృష్ణ తోట, రామకృష్ణ గౌడ్ ప్రతాని, పూసల కిశోర్ ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గం 2025 వరకు ఉంటుంది.