Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అంబర్‌పేట పోలీస్ గ్రౌండ్స్‌లో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. హైకోర్టు ఆదేశాల మేరకు రీ మెజర్మెంట్స్ కోసం అభ్యర్థులను అంబర్‌పేట గ్రౌండ్‌కు సెలక్షన్ కమిటీ పిలిపించింది. గతంలో వచ్చిన ఎత్తు కంటే రీ మెజర్మెంట్లో తక్కువ వచ్చిందంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. డిజిటల్ మీటర్ ద్వారా తమ ఎత్తును తక్కువ చేసి చూపించి డిస్క్వాలిఫై చేస్తున్నారని ఆరోపించారు. మ్యాన్యువల్‌గా ఎత్తు చెక్ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ సెలక్షన్ కమిటీ పట్టించుకోవడం లేదని, తమకు మెయిన్స్‌కు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.