Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలం, ఇందల్ వాయి గ్రామానికీ చెందిన ముత్యం గంగాధర్ హైదరబాద్ లోని అంబర్ పెట్ లో రెన్యల్ట్ కార్ సర్వీస్ సెంటర్ లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తనతో పాటు డ్యూటీకి కొడుకు ప్రదీప్(5)ని తీసుకొని వెళ్ళాడు.
కంపెనీలోని కుక్కలు ప్రదీప్ ని పలు చోట్లతో గాయపరచడంతో ప్రదిప్ మృతి చెందాడు. ఈ విషయమై అంబర్ పెట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని మృతుడి తండ్రి ముత్యం గంగాధర్ నవతెలంగాణ కు తెలిపారు. అభంశుభం తెలియని ప్రదిప్ మృతికి కారణమైన రెన్యల్ట్ కార్ సర్వీస్ సెంటర్ యజమాని పై కఠిన చర్యలు తీసుకోని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఇదే విషయమై కేసు నమోదు చేసి కోర్టు కు వేళ్ళడం జరుగుతుందని ఇందల్ వాయి ఎంపిటిసి మారంపల్లి సుధాకర్ తెలిపారు.