Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆఫ్ఘనిస్తాన్
గర్భనిరోధకాలపై అక్కడి తాలిబాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ముస్లిం జనాభాను అరికట్టేందుకు జరుగుతున్న కుట్రగా అభివర్ణిస్తున్న తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లోని అన్ని మెడికల్ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నది.
గర్భం నిరోధించుకోవడానికి ఎలాంటి గర్భనిరోధకాలను ఉపయోగించవద్దని తాలిబాన్ ప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి మరీ మహిళలను బెదిరిస్తున్నట్లుగా తెలుస్తున్నది. మెడికల్ స్టోర్స్‌లో కూడా పెద్ద ఎత్తున సోదాలు జరుగుతున్నాయి. తద్వారా గర్భనిరోధక మందుల అమ్మకాలను నిలిపివేయవచ్చునని అక్కడి ప్రభుత్వం భావిస్తున్నది. కాబూల్‌లోని అన్ని మెడికల్ షాపులపై ప్రత్యేక నిఘా పెట్టారు. పలు ప్రాంతాల్లో దీనికి సంబంధించిన నోటీసులు అతికించారు. అయితే 2021 ఆగస్టు 15 న తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన అనంతరం అక్కడి మహిళలపై కఠిన ఆంక్షలు విధిస్తూ వస్తున్నది. ఉన్నత విద్యను అభ్యసించకుండా అడ్డుకున్నారు. మహిళలు ఉద్యోగం చేయడానికి వీల్లేదని హుకూం జారీ చేశారు. ఇప్పుడు గర్భనిరోధక సాధనాల వాడకాన్ని కూడా నిషేధించారు.