Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ చివరి రెండు టెస్టులు, ఆ తర్వాత జరగనున్న వన్డే సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడేందుకు స్క్వాడ్ నుంచి తప్పుకున్న పేసర్ జయదేవ్ ఉనాద్కత్ రెండు టెస్టులకు ఎంపికయ్యాడు. దీనిలో రెండు టెస్టుల్లోనూ విఫలమైన కేఎల్ రాహుల్ కూడా స్వ్కాడ్‌లో ఉన్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇండోర్ వేదికగా మార్చి 1న మూడో టెస్టు ప్రారంభం కానుంది. నాలుగో టెస్టు మార్చి 9-13న అహ్మదాబాద్‌లో జరగనుంది.
భారత్, ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్ ఆడనున్నాయి. మొదటి వన్డే మార్చి 17న ముంబైలో ప్రారంభం కానుంది. మార్చి 19న విశాఖపట్నం వేదికగా రెండో వన్డే జరగనుంది. ఇరుజట్లు మార్చి 22న చెన్నైలో మూడో వన్డేలో తలపడతాయి. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేస్‌లో హార్ధిక్ పాండ్యా జట్టును నడిపించనున్నాడు.
టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్.
వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యార్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనాద్కత్.