Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన నందమూరి తారకరత్న భౌతికకాయానికి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు. షర్మిల ఈ సాయంత్రం రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో ఉన్న తారకరత్న నివాసానికి వచ్చారు. తీవ్ర విషాదంలో ఉన్న తారకరత్న భార్య అలేఖ్యను ఓదార్చారు. అలేఖ్యతో మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితోనూ, అలేఖ్య కుటుంబ సభ్యులతోనూ షర్మిల మాట్లాడారు.