Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బండ్లగూడ జాగీర్, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు దుండగులు వివాహితను అపహరించి లైంగికదాడికి పాల్పడ్డారు. ఆమె పుస్తెలతాడు లాక్కొని పరారయ్యారు. ఆదివారం ఉదయం ఈ దారుణం వెలుగు చూసింది. వికారాబాద్ జిల్లాకు చెందిన దంపతులు గండిపేట మండలం బండ్లగూడజాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పీరంచెరువు ప్రాంతంలో నివసిస్తున్నారు. భర్త కూలి పనులు చేస్తాడు. భార్య (29) గేటెడ్ కమ్యూనిటీలో పనిచేస్తోంది. ఆమె శుక్రవారం పని ముగించుకుని ఇంటికి వెళుతుండగా.. ఓ వ్యక్తి (30) అనుసరించాడు. తమ దగ్గర పని ఉందని మభ్యపెట్టి ఆమె ఫోన్ నంబరు తీసుకున్నాడు. శనివారం తెల్లవారుజామున ఆమెకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఉదయం పనికి వెళ్తుండగా.. బాచుపల్లికి చెందిన కారు డ్రైవర్ శుభం శర్మ (29), ప్రైయివేటు ఉద్యోగి సుమిత్‌కుమార్ శర్మ (33) కారులో అనుసరించారు. పని ఇప్పిస్తామని మాట్లాడుతూ.. బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. మత్తుమందు కలిపిన పానీయాన్ని బలవంతంగా తాగించారు. ఆమె స్పృహ కోల్పోయాక.. కిస్మత్పూర్, దర్గాఖలీజ్‌ఖాన్, ఓఆర్ఆర్పై కారులో తిప్పుతూ అసభ్యంగా ప్రవర్తించారు. నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరూ ఆమెపై లైంగికదాడి చేశారు. రాత్రివేళ బాధితురాలి మెడలోని 25 గ్రాముల బంగారు పుస్తెలతాడు లాక్కుని ఆమెను గండిపేట సమీపంలో వదిలి వెళ్లిపోయారు. మత్తుమందు వల్ల ఆమె చాలాసేపటివరకు తేరుకోలేదు. స్పృహ వచ్చాక భర్తకు, మేనమామకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వారు వెళ్లి ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. వెంటనే నార్సింగి పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ నంబర్లు, సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని కారు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిలో ఒకరిపై పాత కేసులు ఉన్నట్లు సమాచారం.