Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్మూకశ్మీరులో మరో సారి కొండచరియలు విరిగిపడ్డాయి. రాంబన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో 13 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటన తర్వాత బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.రాంబన్-సంగల్దన్ గూల్ రహదారికి ఎగువన ఉన్న గూల్ తహసీల్‌లోని సంగల్దాన్‌లోని దుక్సర్ దాల్వా వద్ద ఒక చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు.బాధిత కుటుంబాలను టెంట్ లకు తరలించి వారికి దుప్పట్లు, వంటపాత్రలు ఇచ్చామని అధికారులు చెప్పారు. ఆర్మీ అధికారులు బాధితులకు ఆహారం అందిస్తున్నారు. కొండచరియలు విరిగిపడటం వల్ల 33కెవి పవర్ లైన్, ప్రధాన నీటి పైప్‌లైన్‌కు పెను ప్రమాదం ఏర్పడింది.సంఘటన స్థలానికి గనులు, భూగర్భశాస్త్రవేత్లు, ఇంజనీర్ల బృందాన్ని పంపించాలని డిప్యూటీ కమిషనర్ కోరారు. కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో గూల్ తహసీల్ ప్రధాన కార్యాలయానికి ప్రత్యామ్నాయ రహదారిని నిర్మించడానికి అత్యవసర ఏర్పాట్లు చేయాలని జనరల్ రిజర్వ్ ఇంజినీరింగ్ ఫోర్స్ ను అధికారులు అభ్యర్థించారు.