Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలగాణ - హైదరాబాద్
అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ నటుడు తారకరత్న అంత్యక్రియలు సోమవారం సాయంత్రం హైదరాబాద్ మహాప్రస్థానంలో జరుగనున్నాయి. ప్రస్తుతం శంకర్పల్లి మండలం మోకిళ్లలోని నివాసంలో ఉన్న తారకరత్న భౌతికకాయాన్ని మరికాసేపట్లో ఫిల్మ్‌ఛాంబర్‌కు తరలించనున్నారు.
అభిమానుల సందర్శనార్థం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫిలింఛాంబర్లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. తారకరత్నకు అభిమానులతోపాటు సినీప్రముఖులు నివాళులర్పించనున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటల తర్వాత అక్కడి నుంచి అంతిమయాత్ర సాగనుంది. తారకరత్న అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.