Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఛత్తీస్‌గఢ్
రాయ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల మైనర్ బాలికను దాదాపు 47 ఏళ్ల వయస్సున్న వ్యక్తి నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాయ్‌పూర్‌లోని గుఢియారీ ప్రాంతంలో ఓంకార్ తివారీ అలియాస్ మనోజ్ అనే వ్యక్తి ఓ దుకాణం నడుపుతున్నాడు. గత కొన్నాళ్లుగా బాధిత బాలిక అందులోనే పని చేస్తోంది.
ఈ తరుణంలో తనను పెళ్లి చేసుకోవాలని నిందితుడు ఆమెపై ఒత్తిడి చేయగా అందుకు బాలికతోపాటు, ఆమె తల్లి నిరాకరించారు. దీంతో కోపం పెంచుకున్న నిందితుడు అదును చూసి బాలికపై దాడికి దిగాడు. ఆమెను గాయపరిచి నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాడు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈక్రమంలో బాధిత బాలికను చికిత్స కోసం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఆమె కోలుకున్న తర్వాత ఆమె నుంచి వాంగ్మూలం నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.