Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు పంపింది. ఈనెల 21న కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసులలో తెలిపింది. అయితే గవర్నర్‌పై ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈ నోటీసులు జారీ అయ్యాయి.
గవర్నర్‌పై ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో బీసీ రాజకీయ ఐకాస ఫిర్యాదు చేసింది. కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదుకై డీజీపీకి ఆదేశాలివ్వాలని ఐకాస ఛైర్మన్ రాచాల యుగేందర్‌గౌడ్ ఎస్హెచ్ఆర్సీని కోరారు. ఈ తరుణంలోనే వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని మహిళా కమిషన్ ఆదేశించింది.