Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుపతి
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు తిరుమల సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. అయితే ఆదివారం తిరుమలని 79,555 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ తరుణంలో నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.44 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. నిన్న 21,504 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.