Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దుండగులు రాళ్ల దాడికిపాల్పడ్డారు. ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న తన నివాసంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారని, దీంతో కిటికీల అద్దాలు పగిలిపోయాయని తెలిపారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నదని సమాచారం. ఈమేరకు ఎంపీ అసదుద్దీన్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అయితే ఢిల్లీలోని తన నివాసంపై 2014 నుంచి ఇది నాలుగోసారని జైపూర్ పర్యటన ముగించుకుని ఆదివారం రాత్రి 11.30 గంటలకు ఢిల్లీలోని ఇంటికి తిరిగివచ్చేసరికి దాడి జరిగింది. ఆగంతకులు రాళ్లు విసరడంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయయి. ఈఘటనపై ఢిల్లీ పోలీసులు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని ట్వీట్ ద్వారా తెలిపారు.