Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు
ఐఫోన్ కోసం ఓ వ్యక్తి డెలివరీ ఏజెంట్ ప్రాణాలు తీశాడు. ఆ క్రమంలో మృతదేహాన్ని నాలుగురోజులు బాత్రూమ్లో దాచిపెట్టాడు. ఫిబ్రవరి 7వ తేదీన చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని హసన్ జిల్లాకు చెందిన హేమంత్ దత్త అనే వ్యక్తి తన వద్ద డబ్బు లేకపోయినా ఆన్లైన్లో రూ.46వేలకు సెకెండ్ హ్యాండ్ ఐఫోన్ బుక్ చేసుకున్నాడు. ఫిబ్రవరి 7వ తేదీన ఇ-కార్ట్ ఎక్స్‌ప్రెస్ (ఫ్లిప్‌కార్ట్ అనుబంధ సంస్థ)లో డెలివరీ బాయ్ ఆ ఫోన్‌ను హేమంత్ ఇంటికి డెలివరీ చేశాడు. అయితే, డబ్బులు ఇవ్వకముందే సెల్‌పోన్ డబ్బాను తెరిచి చూపించాలని కోరాడు. డబ్బులు ఇస్తేనే ఫోన్ డెలివరీ చేస్తానని ఆ బాయ్ తేల్చి చెప్పాడు. దీంతో తన వద్ద డబ్బులు లేవని, కాసేపు ఇంట్లో కూర్చుంటే తీసుకొస్తానని డెలివరీ ఏజెంట్‌ను నమ్మించాడు. ఆ మాటలు నమ్మి ఇంట్లోకి వచ్చిన ఆ డెలివరీ బాయ్‌ను హేమంత్ కత్తితో పలుమార్లు విచక్షణారహితంగా పొడిచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ క్రమంలో నాలుగు రోజులు శవాన్ని ఇంట్లోనే బాత్రూంలో దాచిపెట్టాడు.మృతదేహం వాసన రావడంతో గోనెసంచిలో దాచి, బైక్‌పై సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ పెట్రోల్ పోసి మృతదేహానికి నిప్పంటించాడు. అయితే నాలుగు రోజులుగా డెలివరీ బాయ్ కన్పించకపోవడంతో అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా డెలివరీ బాయ్ మృతదేహాన్ని తీసుకుని నిందితుడు బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో కన్పించడం. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.