Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భారీ భూకంపం ధాటికి అతలాకుతలమైన తుర్కియే, సిరియా దేశాలను ఆదుకునేందుకు భారత్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఆపరేషన్ దోస్త్ పేరుతో భారత్ సహాయక చర్యల్లో పాల్గొనింది. సహాయక కార్యక్రమాల్లోఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ పాలుపంచుకున్నాయి. అయితే ఆపదలో ఉన్న తమ దేశానికి అండాగా నిలిచిన భారత్‌కు తుర్కియే కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు భారత్‌లోని తుర్కియే అంబాసిడర్ ఫిరాత్ సునేల్ ట్వీట్ చేశారు.
భారత ప్రభుత్వం మాదిరే విశాల హృదయం ఉన్న భారతీయ ప్రజలు కూడా భూకంప ప్రాంతంలో ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి చేతులు కలిపారు. మీ విలువైన సహాయానికి మేము నిజంగా అందరినీ అభినందిస్తున్నాము అంటూ సునేల్ ట్వీట్లో పేర్కొన్నారు. భారత్ నుంచి తుర్కియేకి తరలించిన టన్నుల కొద్దీ సామగ్రికి సంబంధించిన వీడియోను ట్వీట్‌కు జతచేశారు.
పారా ఫీల్డ్ హాస్పిటల్ ద్వారా తుర్కియేలో సుమారు 4వేల మందికి చికిత్స అందించినట్లు ఇండియన్ ఆర్మీ మెడికల్ టీమ్ తెలిపింది. ఆపరేషన్ దోస్త్‌కు వెళ్లిన ఇండియన్ ఆర్మీ మెడికల్ టీమ్ స్వదేశానికి తిరిగి వచ్చింది. ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో ఇవాళ మెడికల్ బృందంతో విమానం ల్యాండ్ అయ్యింది.