Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
తుర్కియే భూకంప బాధితుల్ని రక్షించేందుకు ఆపరేషన్ దోస్త్ పేరుతో భారత్ సహాయక చర్యల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఈ తరుణంలో ఆపరేషన్ దోస్త్‌కు వెళ్లిన ఇండియన్ ఆర్మీ మెడికల్ టీమ్ స్వదేశానికి తిరిగి వచ్చింది. ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో ఇవాళ మెడికల్ బృందంతో విమానం ల్యాండ్ అయ్యింది. భూకంప కేంద్రమైన హటయ్లోని ఇకేంద్రన్లో 30 పడకల ఫీల్డ్ హాస్పిటల్‌ను భారత బృందం ఏర్పాటు చేసింది. సుమారు నాలుగు వేల మంది పేషెంట్లకు అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. దీనిలో 60 పారా ఫీల్డ్ మెడికల్ బృందంలో మొత్తం 99 మంది ఉన్నారు.
ఈ క్రమంలో 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ ఆదర్శ శర్మ మాట్లాడుతూ తుర్కియేకు సైనిక దళాన్ని పంపించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కేవలం కొన్ని గంటల్లోనే ఫీల్డ్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 4వేల మంది పేషెంట్లకు చికిత్స అందించామని, దాంట్లో మేజర్, మైనర్ సర్జరీ కేసులున్నాయన్నారు. సరైన సమయంలో సరైన చికిత్సను అందించామని, ఆ లక్ష్యాన్ని తాము అందుకున్నట్లు కల్నల్ ఆదర్శ్ శర్మ తెలిపారు.