Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న పార్థివదేహానికి రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. ఇవాళ మధ్యాహ్నం సాయన్న నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహంపై పుష్పాగుచ్ఛాన్నుంచి అంజలి ఘటించారు. అనంతరం సాయన్న కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి వెంట రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, పులువురు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. సాయన్నకు మంత్రి నివాళులర్పించిన చిత్రాలను బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేయగా.. మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. కాగా, కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న (72) అనారోగ్య కారణాలతో ఆదివారం కన్నుమూశారు. సాయన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనకు వివాదరహితుడిగా, మితభాషిగా మంచి పేరుంది.