Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలాండ్ పర్యటన నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఆ దేశ అధ్యక్షుడు జలెన్స్ కి తో భేటీ అయ్యారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత బైడెన్ ఉక్రెయిన్ లో పర్యటించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య మొదలైన తర్వాత తొలిసారి అక్కడికి వెళ్లారు. రెండు దేశాల మధ్య యుద్ధం మొదలై మరో నాలుగు రోజుల్లో ఏడాది కావస్తున్న సమయంలో బైడెన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే యుద్ధం మొదలైనప్పటినుండి ఉక్రెయిన్ కు అమెరికా అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కి తో బైడెన్ చర్చలు జరిపారు. సుమారు 500 మిలియన్ డాలర్ల మిలిటరీ సహాయ ప్యాకేజీని ఉక్రెయిన్ కు అందజేయనున్నట్లు బైడెన్ ఈ సందర్భంగా తెలిపారు.