Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా.. ఎవరితో పొత్తు పెట్టుకున్నా నిరంతరం ప్రజల సమస్యల కోసమే పోరాటాలు చేస్తామని అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. పినపాక నియోజకవర్గంలో సీపీఐ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పొత్తులను ఆసరగా చేసుకొని కమ్యూనిస్టు పార్టీని అవహేళన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సీపీఐ గురించి బీఆర్ఎస్ వాళ్లు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని, వ్యంగ్యంగా మాట్లాడే నేతలను అధిష్టానం కంట్రోల్ చేయాలని సూచించారు. పేదల కోసమే కమ్యూనిస్టు పార్టీ పుట్టిందని, వారి కోసమే పోరాడుతుందని, ఇకపై కూడా పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. అందుకే వందేళ్లయినా చెక్కుచెదరకుండా ఉందన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఉంటేనే సమాజానికి రక్ష అన్నారు సాంబశివరావు. అన్యాయాన్ని ప్రశ్నించేవారే, ఎదురించే వారే కమ్యూనిస్టు అని తెలిపారు.