Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు ముగిశాయి. పోలీసుల భద్రత నడుమ బంధువులు, కుటుంబ సభ్యులు, అభిమానుల నడుమ మారేడుపల్లిలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. సాయన్న భౌతికఖాయం శ్మశాన వాటికకు చేరుకున్న తర్వాత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన అభిమానులు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. శ్మశానవాటిక వద్దకు చేరుకున్న మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిని చూసి సాయన్న అభిమానులు నినాదాలు చేశారు. అధికారులతో మాట్లాడిన అనంతరం వారిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు ప్రయత్నించారు. అధికారిక లాంఛనాలపై కలెక్టర్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, అందువల్లనే ఏర్పాటు చేయలేదని డీసీపీ స్థాయి అధికారి ఒకరు అభిమానులకు, కుటుంబ సభ్యులకు వివరించారు. అధికారిక లాంఛనాల ఉత్తర్వులకు సమయం పడుతుందని, చీకటి పడుతున్నందున అంత్యక్రియలకు కూడా బాగా ఆలస్యం అవుతుందని అన్నారు. అంత్యక్రియలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. దీంతో అభిమానులు ఆందోళన విరమించారు. అనంతరం పోలీసు భద్రత నడుమ సాయన్న అంత్యక్రియలు నిర్వహించారు.