Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జహీరాబాద్ : ఓ తల్లి దారుణానికి పాల్పడింది. తన సుఖం కోసం కుమారుడిని చంపింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిధిలోని శాంతినగర్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. హోతి(కే) తాండకు చెందిన అక్షయ్ రాథోడ్(24) తన తల్లి యశోద భాయ్‌తో కలిసి శాంతినగర్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే తల్లి యశోద అదే గ్రామానికి చెందిన ప్రేమ్ దాస్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం కుమారుడికి తెలియడంతో తల్లిని పలుమార్ల మందలించాడు. ప్రేమ్ దాస్‌తో సంబంధాలు మానుకోవాలని హెచ్చరించాడు. తల్లి పెడచెవిన పెట్టింది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న కుమారుడిని ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది. దీంతో ఆదివారం కుమారుడు నిద్రిస్తున్న సమయంలో తన ప్రియుడు ప్రేమ్ దాస్‌తో కలిసి అతనిపై రోకలిబండతో మోది హత్య చేసింది. ఈ కేసులో యశోద, ప్రేమ్ దాస్‌ను అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరు పరిచామని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.