Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అంకారా
భారీ భూకంపం ధాటికి అతలాకుతలమైన తుర్కియేలోని హతాయ్ ప్రావిన్సులో సోమవారం మరోసారి శక్తిమంతమైన భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైందని తుర్కియే విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. భూకంప కేంద్రం ఇక్కడి డెఫ్నె నగర సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ కంపన తీవ్రతకు ఇప్పటికే బలహీనపడిన కొన్ని భవనాలు కూలిపోయాయని, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదని ఇక్కడి వార్తాసంస్థ ఒకటి వెల్లడించింది. భూకంప ప్రభావం సిరియా, జోర్డాన్, ఇజ్రాయెల్ దేశాల్లోనూ స్వల్పంగా కనిపించింది.