Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సంధ్య కన్వెన్షన్ ఎండీ సరణాల శ్రీధర్‌రావును ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఒక సివిల్ వ్యవహారంలో తమను మోసం చేశాడంటూ అమితాబ్ బంధువులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగా శ్రీధర్‌రావు బ్యాంకు ఖాతా లో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వాటికి వివరణ ఇవ్వాలంటూ శ్రీధర్‌రావుకు 91 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. ఆయన స్పందించకపోవడంతో ఢిల్లీ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో సోమవారం ఉద యం ఢిల్లీ పోలీసులు శ్రీధర్‌రావును అరెస్టు చేసి, రాజేంద్రనగర్ 13వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఆయన్ను ఢిల్లీ తీసుకెళ్లి విచారించడానికి 3 రోజుల పాటు ట్రాన్సిట్ వారెంట్‌పై కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. అదే సమయంలో శ్రీధర్‌రావుకు బెయిల్ ఇవ్వాలని ఆయన న్యాయవాది అభ్యర్థించారు. కేసును పరిశీలించిన మేజిస్ట్రేట్ శ్రీధర్‌రావును తీసుకెళ్లడానికి ఢిల్లీ పోలీసులకు అనుమతి ఇచ్చారు. బెయిల్ కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేసుకోవాలని ఆయన తరఫున న్యాయవాదికి సూచించారు.