Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా- సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్నా గిల్ మధ్య నెలకొన్న వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. పృథ్వీ షా (23), అతడి స్నేహితుడు ఆశిష్ యాదవ్పై సప్నా గిల్ తాజాగా ముంబై ఎయిర్పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో బెయిలుపై బయటకు వచ్చిన వెంటనే ఆమె వారిపై కేసు పెట్టారు. పృథ్వీషా స్నేహితుడి కారును ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన కేసులో సప్నా గిల్ సహా ఎనిమిది మందిపై ఒషివారా పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైలోని ఓ హోటల్లో గిల్ భోజనం చేస్తున్న సమయంలో సెల్ఫీ తీసుకునే విషయంలో సప్నా, గిల్ మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో జరిగిన గొడవలో ఆశిష్ కారుపై సప్నాగిల్, ఆమె స్నేహితులు దాడి చేసినట్టు ఆరోపణలున్నాయి. అయితే, పృథ్వీ షానే తమను తొలుత రెచ్చగొట్టినట్టు సప్నా ఆరోపిస్తున్నారు.