Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. పఠాన్ చెరు బీరంగూడలో ఆగి ఉన్న డీసీఎంలో మంటలు చెలరేగాయి. డీసీఎంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న కారు, మినీబస్సులకు వ్యాపించాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాద గురించి తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదంలో మూడు వాహనాలు పూర్తిగా దగ్థం అయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.