Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన 'కాంతార' సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా విజయవిహారం చేసింది. కేవలం 16 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దర్శకుడిగా . రచయితగా కూడా ఈ సినిమా రిషబ్ శెట్టికి ప్రశంసలను తెచ్చిపెట్టింది. ఆ మధ్య రజనీకాంత్ కూడా రిషబ్ శెట్టిని తన ఇంటికి ఆహ్వానించి సత్కరించారు. ఆ తరువాత ఈ సినిమాకి ప్రీక్వెల్ చెయ్యడానికి రిషబ్ శెట్టి రంగంలోకి దిగాడు. ఫస్టు పార్ధుకి పాన్ ఇండియా స్థాయిలో రెస్పాన్స్ రావడం వలన, సెకండ్ పార్టును పాన్ ఇండియా రేంజ్ లోనే నిర్మించాలనే ఆలోచనలో రిషబ్ శెట్టి ఉన్నాడు.