Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్; హైదరాబాదులో ఓ చిన్నారి వీధికుక్కల బారినపడి మృతి చెందడం తెలిసిందే. రోడ్డుపై వెళుతున్న ఐదేళ్ల బాలుడిని వీధి కుక్కలు దారుణంగా కరిచి చంపేయడం అందరినీ కలచివేసింది. ఈ విషాదకర ఉదంతంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలుడి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఇటువంటి బాధాకరమైన ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలోనూ వీధి కుక్కల సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. కుక్కల జనాభా పెరగకుండా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. జంతు సంరక్షణ కేంద్రాలు, జంతు జనన నియంత్రణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు.