Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగిన ఘటనల నేపథ్యంలో అరెస్ట్ చేసిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు పీఎస్‌కు తీసుకొచ్చారు. గన్నవరం పీఎస్‌లోనే ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో పట్టాభితో పాటు మరో 11 మందిని కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. గన్నవరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారంటూ పట్టాభిరామ్‌పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సోమవారం గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటన సమాచారం తెలుసుకుని గన్నవరం పీఎస్‌కు వచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో ఎక్కించుకుని అక్కడి నుంచి వేరే చోటికి తరలించారు. తొలుత వీరవల్లి, అనంతరం హనుమాన్‌జంక్షన్ ఠాణాకు తరలిస్తున్నారని చెప్పినా, ఆ రెండు చోట్లకు తీసుకురాలేదు. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉంచడం, ఎక్కడ ఉన్నారనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడంతో నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. తన భర్త ఆచూకీ చెప్పాలంటూ పట్టాభి భార్య చందన ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నానికి గన్నవరం పీఎస్‌కు పట్టాభిని తీసుకొచ్చారు.