Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ 'పోకో' మన దేశంలో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. సీ సిరీస్ లో 'పోకో సీ55'ని విడుదల చేసింది. 50 మెగా పిక్సెల్ కెమెరా ఉన్న ఈ ఫోన్ ధర రూ.10 వేలలోపే ఉండనుంది. పోకో సీ55 ఫోన్ లో మీడియా టెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ను ఏర్పాటు చేశారు. 50 మెగా పిక్సెల్ కెమెరాతో వెనుక వైపు రెండు కెమెరాలు, 5 మెగా పిక్సెల్ తో సెల్ఫీ కెమెరా ఏర్పాటు చేశారు. 6.71 ఇంచుల హెచ్ డీ స్క్రీన్ ఉంది. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, 4జీ కనెక్టివిటీ, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 10డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ తదితరాలు ఉన్నాయి. 4 జీబీ 64 జీబీ వేరియంట్ ధర రూ.9,499 అని పోకో వెల్లడించింది. అదే 6 జీబీ 128 జీబీ వేరియంట్ ధర రూ.10,999గా నిర్ణయించింది. కూల్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్, పవర్ బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి తెచ్చింది. ఈనెల 28 నుంచి అమ్మకాలు మొదలుకానున్నాయి. ఫ్లిప్ కార్ట్ లేదా కంపెనీ వెబ్ సైట్ నుంచి ఈ ఫోన్ ను ఆర్డర్ చేసుకోవచ్చు. హెచ్ డీఎఫ్ఎసీ బ్యాంక్, ఎస్ బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు డిస్కౌంట్ కూడా ఉంది. ప్రత్యేక తొలి రోజు ధరగా బేస్ మోడల్ ఫోన్ ను 8,499కి, హైస్టోరేజ్ ఫోన్ ను 9,999కే అమ్మనున్నట్లు కంపెనీ ప్రకటించింది.