Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అహ్మదాబాద్
బ్రిటీష్ కాలంలో మచ్చూ నదిపై నిర్మించిన ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ గత ఏడాది అక్టోబర్ 30వ తేదీన కూలిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో గుజరాత్లో గత ఏడాది మోర్బీ బ్రిడ్జ్ కూలిన ఘటనలో మరణించినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షలు చెల్లించాలని ఒరేవా గ్రూపునకు ఇవాళ గుజరాత్ హైకోర్ట ఆదేశాలు జారీ చేసింది. ఆ ఘటనలో గాయపడ్డవారికి ఒక్కొక్కరికి రెండు లక్షలు ఇవ్వాలని కోర్టు తెలిపింది.
చీఫ్ జస్టిస్ సోనియా గోకాని, జస్టిస్ సందీప్ భట్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. బ్రిడ్జ్ మెయింటేనెన్స్లో లోపాలు ఉన్నాయని, సరైన సమయంలో రిపేర్లు చేయలేదని ఆ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సిట్ తన రిపోర్టులో పేర్కొన్నది. అయితే మోర్బీ బ్రిడ్జ్ కూలిన ఘటనలో సుమారు 135 మంది మరణించారు. ఒరేవా గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ జయ్‌సుఖ్ పటేల్‌ను జనవరి 31వ తేదీన అరెస్టు చేశారు. గుజరాత్‌లోని కోర్టు ముందు ఆయన సరెండర్ అయ్యారు.